టీడీపీ కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

67చూసినవారు
ఖమ్మం టీడీపీ జిల్లా కార్యాలయంలో హిందుపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కేతినేని హరీశ్ చంద్ర మాట్లాడుతూ. బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లోనే కాదు సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ విశేష ఆదరణ పొందుతున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్