భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు పటేల్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని బల్లేపల్లి ఐఎఫ్టియు జిల్లా ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు, పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్, అటు గృహవసతి, అడ్డాల్లో మౌలిక వసతులు తదితర సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు.