ట్యాంక్ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్

55చూసినవారు
ట్యాంక్ బండ్ పై ఫుడ్ ఫెస్టివల్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మెప్మా, డీఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యాన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై ఆదివారం సాయంత్రం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఫుడ్ ఫెస్టివల్ ను సందర్శించి మాట్లాడారు. తెలంగాణ రుచులను ప్రజలందరికి చేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన 58 రకాల వంటకాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్