ఖమ్మం: సాయుధ పోరాట యోధురాలు రాధమ్మ మృతి

54చూసినవారు
ఖమ్మం: సాయుధ పోరాట యోధురాలు రాధమ్మ మృతి
ఖమ్మం సీపీఐ సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ యోధురాలు పాటిబండ్ల రాధమ్మ (96) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ సీనియర్ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, తదితరులు ఆమె పార్దీవ దేహాన్ని సందర్శించి, పార్టీ జెండాను కప్పి, నివాళులు అర్పించారు. రాధమ్మ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన చైతన్యవంతురాలిని కోల్పోయిందన్నారు.

సంబంధిత పోస్ట్