ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36, 37వ డివిజన్లలో జరుగుతున్న రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులను బుధవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. ట్రాక్ విస్తరణ కోసం ఎంత భూమిని సేకరించారు? పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలను కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద కొత్తగా పెద్ద డ్రైన్ నిర్మించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.