ఖమ్మం: నవంబర్ 5న ప్రజాభిప్రాయ సేకరణ

77చూసినవారు
ఖమ్మం: నవంబర్ 5న ప్రజాభిప్రాయ సేకరణ
స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన, అవసరమైన రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయ సేకరణకు తెలంగాణ బీసీ కమిషన్ బృందం నవంబర్ 5న ఖమ్మం వస్తోందని, కలెక్టరేట్లో జరిగే సమావేశంలో సంఘాల బాధ్యులు అభిప్రాయాలను రాత పూర్వకంగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని తెలిపారు.