సుడా పరిధి గ్రామపంచాయతీలోని ఎల్ఆర్ఎస్ లపై ఎంపీఓ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ను త్వరితగతిన పరిశీలన చేసి దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ లు అందించాలని తెలిపారు. అదేవిధంగా అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా సీపీఓ వికాస్, డిటీసీ పీవో ప్రసాద్, తదితరులు ఉన్నారు.