పాపటపల్లి గ్రామంలో ఎటు చూసినా సమస్యలకు నిలయంగా మారిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. రెండు రోజులు పాటు కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని బండ్ల వెంకన్న, ఇంట్లోకి వరద నీరు చేరడంతో, ఇంటి చుట్టూ వర్షపు నీరు ఎటు పోలేని పరిస్థితి. ఇంటి ముందు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వాపోయారు. అధికారులు ఇకనైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు.