ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి అది అమలు చేయకుండా మోసం చేసిందని పేర్కొన్నారు.