గుండెపోటుతో రామాలయం అర్చకుడు మృతి

4676చూసినవారు
గుండెపోటుతో రామాలయం అర్చకుడు మృతి
రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల రామాలయం అర్చకుడు నల్లావుల ప్రభాకరాచార్యులు(70) గుండెపోటుతో మృతి చెందాడు. ఏన్కూరు మండలం నాచారానికి చెందిన ఆయన గత ఇరవై ఏళ్లుగా వేపకుంట్ల రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. రోజులాగే ఉదయం గుడికి వెళ్లిన ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. కాగా, ఆయన భార్య రెండేళ్ల క్రితమే మృతి చెందగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్