డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

82చూసినవారు
డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ఖమ్మం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈసందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె. అజయ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందే సమయాన నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు ఇటీవల గుర్తించారు. ఈ వ్యవహారంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ ఎస్. జ్యోతిపాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్