రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రారంభమైంది.డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఏడు గ్రామాలు, మూడు మున్సిపాలిటీల లోని వార్డులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.