ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గురువారం ముసాయిదా జాబితాపై అఖిలపక్ష పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టులో ఉన్న అభ్యంతరాలను అధికారులకు నాయకులు వివరించారు. అలాగే పలు పార్టీల నాయకుల సూచనలను అధికారులు తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.