ముదిగొండ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శనివారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి తహశీల్దార్ సునీత ఎల్జిబెత్ ను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి స్లాట్లు, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉండకుండా చూడాలని, ఓటర్ ఐడిలు మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదును 25వ తారీఖు లోపు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.