ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని తెలిపారు.