ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన సందర్భంగా బీజేపీ యువ మోర్చా నాయకులు స్వర్ణకర్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం, గర్భిణీ మహిళల కోసం శుక్రవారం మధిర పట్టణ కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహచర నాయకులతో కలిపి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు.