మధిర పట్టణంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం గడియలపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి మహిళా లోకానికి వారి చైతన్యానికి స్ఫూర్తిదాయకమని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు.