ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో అమృత్ భారత్ పథకం కింద కొనసాగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను గురువారం రైల్వే డిఆర్ఎం భర్ తేశ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు, నిర్వాహకులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.