మధిర మండలం కృష్ణాపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరివేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజు అన్నారు. మంగళవారం జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను విద్యార్థులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు.