ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం నాటికి ఘనంగా ముగిశాయని మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 3 రోజుల క్రీడా పోటీలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయులకు, పిఈటిలకు, విద్యార్థులకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.