ముదిగొండలో ఒకరు సస్పెండ్, మరొకరికి షోకాజ్
ముదిగొండలో ఒకరు సస్పెండ్ కాగా, మరొకరికి షోకాస్ నోటీసులను ఇవ్వాలని అదనపు కలెక్టర్ శ్రీజ డిప్యూటి సీఈవోకి ఆదేశాలు ఇచ్చారు. అధికారులపై మండిపడ్డారు. అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాని ఎంపీడీవో శ్రీధర్ స్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విధులకు హాజరు కాని సీనియర్ అసిస్టెంట్ రాజపుత్ర బాలజీతోల్జ సింగ్ ను సస్పెండ్ చేశారు.