సేవ చేయడంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ దే మొదటి స్థానం

81చూసినవారు
సేవ చేయడంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ దే మొదటి స్థానం
సమాజానికి ఎస్ఆర్ఐ ఫౌండేషన్ సంస్థ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖమ్మంలోని స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో శనివారం ఎస్ఆర్ఐ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 130 మంది విద్యార్థినులకు రూ.8 లక్షల విలువైన సైకిళ్లు, ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాప్ ట్యాప్లు, ఐదుగురికి కుట్టు మిషన్లు, పేద విద్యార్థులకు రూ.4 లక్షల స్కాలర్షిప్ లు, వరద ప్రభావిత పాఠశాలల విద్యార్థులు 1,800 మందికి స్కూల్ బ్యాగ్ కిట్లు, 50 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువైన కృత్రిమ పాదాలు, ఐదు ట్రైసైకిళ్లను అందజేశారు. అలాగే, జిల్లాలోని 46 స్వచ్చంద సంస్థల బాధ్యులను సన్మా నించారు. ఫౌండేషన్ యూఎస్ కోర్ కమిటీ సభ్యుడు బయ్యన బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అదనపు డీసీపీ నరేశ్ కుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఫౌం డేషన్ జిల్లా అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, యూఎస్ కోర్ కమిటీ సభ్యులు దొడ్డవునేని హరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి నాగేశ్వర రావు, ఎస్ఆర్ఐ లు చేపూరి లాక్స్, బండి సందీప్, కట్టా సాగర్, పసుమర్తి రంగారావు, దండ్యాల లక్ష్మణ్ రావు, తుక్కాని శ్రీనివాసరెడ్డి, బత్తుల రాజేశ్వరి, పద్మశ్రీ అవార్డీ వనజీవి రామయ్య, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్