రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
కూసుమంచి మండలంలోని పాలేరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని(50) వ్యక్తి మృతి చెందాడు. స్థానిక చెకోపోస్ట్ సమీపాన నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్