దేశ వ్యాప్తంగా భయంకరమైన కరోనా వైరస్ సోకిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మేరకు ఈ భయానకమైన కరోనా వైరస్ ని పూర్తిగా నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలకమైన చర్యలను చేపట్టాయి. కాగా ఈనేపథ్యంలో కొందరు ఈ కరోనా బాధితుల సహాయార్థం భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. దీనికి తోడుగా.. తిరుమలాయపాలెం మండల జెడ్పిటిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్ వారి యొక్క నెల జీతం 10000 రూపాయలను కరోనా వైరస్ బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధి కి విరాళంగా ఇచ్చారు.