పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే

82చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే
సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కరకగూడెం మండలంలోని చిరుమల్ల, వట్టంవారి గుంపులో 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ఆయన ప్రారంభించారు. రూ. 1. 64 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న చొప్పాల పంచాయతీ అల్లేరుగూడెం- శ్రీరంగాపురం బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్