రద్దు చేసిన రైలు సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మణుగూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శుబోధ్ కి సోమవారం వినతిపత్రం అందజేశారు. మణుగూరు నుంచి పలు సర్వీసులను కరోనా కారణంతో రద్దు చేశారని అన్నారు. ప్రస్తుతం నడిచే రైళ్లను నిర్ణీత సమయానికి నడిచేలా చూడాలన్నారు. సింగరేణి, విజయవాడ రైళ్లను మణుగూరు వరకు పొడిగించాలన్నారు.