ఇంటిపై ఒరిగిన విద్యుత్ స్తంబాలు

76చూసినవారు
ఇంటిపై ఒరిగిన విద్యుత్ స్తంబాలు
ఖమ్మం 21వ డివిజన్ అబ్దుల్ కలాం నగర్ రోడ్- 1లో విద్యుత్ స్తంభాలు ఓ ఇంటిపైకి ఒరిగాయి. గత నెలలో నూతన విద్యుత్ స్తంభాలు అధికారులు వేశారు. ఆ సమయంలో స్తంభాలకు గుంతలు లోతుగా తవ్వి వేయలేదు. ప్రస్తుతం వాటి పక్కనే సైడ్ డ్రైనేజీ కోసం కాలువను తవ్వడంతో స్తంభాలు పట్టు కోల్పోయి ఓ ఇంటిపైకి ఒరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్