మాజీ మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ.సంభాని చంద్రశేఖర్ అదేశాలమేరకు సోమవారం స్వర్గీయ కాలం నరసింహారావు జ్ఞాపకర్థంతో వారి కుమారుడు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ వారి కుటుంబ సౌజన్యంతో సత్తుపల్లిలో రిక్షా కార్మికులకు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఆద్యక్షులు పరెడ్ల సత్యనారాయరెడ్డి, సత్తుపల్లి సొసైటీ ఉపాధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పింగుల శామ్యూల్, గొల్ల అప్పారావు, తదితరులు పొల్గొన్నారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చేపట్టిన లాక్ డౌన్ ను ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో ఈ వ్యాధిని జయించవచ్చు అని అన్నారు. స్వీయ నియంత్రణ వల్ల ఈ మహమ్మరిని పారదోలేందుకు మార్గం అన్నారు.