వేంసూరు మండలంలో బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించి వరద బాధితులకు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు. ఇటీవల వరదల కారణంగా సర్వం కోల్పోయి పునరావాస కేంద్రంలో ఉంటున్న బాధితులకు సాయం అందించడం జరిగిందని తెలిపారు. స్థానిక కందుకూరు రైతు వేదిక, వేంసూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో గల పునరావాస కేంద్రాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.