వేంసూర్ మండలం అడసర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలోని ఓ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గురువారం అగ్ని ప్రమాదానికి గురైంది. సుమారు రూ. లక్ష విలువైన బంగారం, రూ. 30 వేలు నగదు కాలిపోయాయని బాధితుడు వేల్పుల నాగేశ్వరావు తెలిపారు. ఇంట్లో ఎవ్వరు లేకపోవటంతో ప్రాణనష్టం జరగలేదన్నాడు. విషయం తెలుసుకున్న మండల తహశీల్దార్ ఎంఎ రాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు.