మాజీ మంత్రి సత్తుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సంభాని చంద్రశేఖర్ అదేశాల మేరకు సోమవారం సత్తుపల్లి మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు గాదె చెన్నారావు సహకారంతో ఒరిస్సా వలస కార్మికులకు రూ.10000 ల విలువగల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఆద్యక్షులు పారెడ్ల సత్యనారాయరెడ్డి, సత్తుపల్లి సొసైటీ ఉపాధ్యక్షులు గాదె చెన్నకేశవ రావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పింగుల శామ్యూల్, రామిశెట్టి సుబ్బారావు, గొల్ల అప్పారావు, హాలవత్ వేంకటేశ్వరావు, షేక్ జానీ, మిరియాల కుమారి, దేవుళ్ళ పెద్దిరాజు తదితరులు పొల్గొన్నారు.