సాగర్ నీరు అందక ఎండిపోతున్న వరి

70చూసినవారు
సాగర్ నీరు అందక ఎండిపోతున్న వరి
సాగర్ నీరు అందకపోవడంతో వరి పంట ఎండిపోతోందని తల్లాడ మండలంలోని పుణ్యపురం మేజర్ కాల్వ పరిధి ఆయకట్టు రైతులు బుధవారం ఆందోళన నిర్వహించారు. మేజర్ కాల్వకు సరిగా నీరు సరఫరా చేయకపోవడంతో పంట ఎండిపోతోందని చెబుతూ నూతనకల్ కు చెందిన రైతులు కాల్వ షట్టర్ వద్ద నిరసన తెలిపారు. సుమారు 150 ఎకరాల్లో వరి పైరు ఎండిపోతున్నందున సరిపడా నీరు విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్