వేంసూరు మండలంలోని ఉపాధ్యాయుల నుండు టి.యస్.యు.టి.యఫ్ ఆన్లైన్ సభ్యత్వం స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం నుంచి, యూనియన్ సి.పి.యస్.వేంసూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.పుల్లారావు సభ్యత్వంతో ప్రారంభించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేకల.ధర్మారావు, జి.యస్.ఆర్.రమేష్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర కమీటీ పిలుపు మేరక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిచనడుతుందని, నిరంతరం ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ , సామాజిక స్పృహ కలిగి ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాలలో పాలుపంచుకుంటు ముందుకు సాగుతున్న తమ సంఘానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సహధ్యక్షులు శ్రీయుతులు శ్రీనివాసరెడ్డి,సుజాత, ఆర్థిక కార్యదర్శి రామ శేషు,కార్యదర్శులు నిర్మల కుమారి,దీన్ దయాళ్, మారేశ్వరరావు,భాస్కరరావు, యాకుబ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు