కల్లూరులో రహదారిపైనే నిలుపుదల చేస్తున్న వాహనాలు

63చూసినవారు
కల్లూరులో రహదారిపైనే నిలుపుదల చేస్తున్న వాహనాలు
కల్లూరు: కల్లూరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన చేపలు, కోళ్లు, మాంసం మార్కెట్ లు ఉన్నాయి. పండుగ రోజుల్లో ఈ మార్కెట్ లు రద్దీగా ఉంటున్నాయి. మార్కెట్ కు వచ్చేవారు రహదారి పైనే ద్విచక్ర వాహనలు నిలుపుదల చేయడంతో, మిగిలిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల స్పందించి వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :