రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం 20 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని పోలంపల్లి మాజీ సర్పంచ్ ధరావత్ భద్రు నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా పై రైతు అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు అధికారులను కోరారు.