భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలి

82చూసినవారు
భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలి
జూలూరుపాడు మండల కేంద్రంలో సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి తాండ్ర వినోద్ రావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్