కారేపల్లి మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచే పేదల పక్షపాతి, ప్రజా సమస్యలపై పోరాడే గొప్ప ఉద్యమకారుడు, ఆదర్శప్రాయుడని కొనియాడారు.