సింగరేణి మండల పరిధిలోని ఎర్రబోడు, మాణిక్యరం, చీమలపాడు, బాజుమల్లయ్య గూడెం, పాటిమీద గుంపు, సింగరేణి గ్రామాలలో జరుగుతున్నటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వేలలో మండల ప్రత్యేక అధికారి గంగాధర్, తహశీల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ తనిఖీల్లో శుక్రవారం పాల్గొన్నారు. ఈ తనిఖీలో గ్రామ కార్యదర్శిలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం సర్వే త్వరగా పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు.