నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

83చూసినవారు
నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు చేయూత అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్