అక్టోబర్ 12 వ తేదీ నుంచి జరిగే జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ ప్రసాద్ బుధవారం తెలిపారు. కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లిలో గల శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి జాతరకు అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ మళ్ళింపు, తదితర ఏర్పాట్లను ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డితో కలసి అడిషనల్ డీసీపీ పరిశీలించారు.