కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటించారు. స్థానిక రాములవారిని దర్శించుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గంలో గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.