సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో యువత ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. యువత కేక్ కట్ చేస్తూ ఉప్పొంగిన అభిమానంతో జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులు మాజీ సీఎం జగన్ మీద మిన్నుగా ఉండాలని కోరారు.