ఏన్కూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని, తద్వారా కాన్పుల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసిన ఆమె పరిసరాలు, వార్డులు, ఓపీ గదులతో పాటు మందులను పరిశీలించి మాట్లాడారు. మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఆతర్వాత కేజీబీవీని ఆమె సందర్శించి భోజన నాణ్యతపై ఆరా తీశారు.