స్కూటీపై వెళుతూ పరీక్షలకు ప్రిపేరవుతున్న బుడ్డోడు (Video)

79చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ తన పిల్లలను స్కూటీపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తోంది. కూతురును ముందు వైపు కూర్చోబెట్టుకోగా.. వెనుక కొడుకును కూర్చోబెట్టింది. స్కూటీ వెళ్తుండగా వెనుక కూర్చున్న పిల్లాడు పాఠశాలకు వెళ్లే క్రమంలో స్కూటీ పైనే పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. స్కూటీ సీటుపై పేపర్లు పెట్టుకుని పెన్నుతో రాసుకుంటున్నాడు. చదువుపై ఈ బుడ్డోడికి ఉన్న శ్రద్ధ చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

సంబంధిత పోస్ట్