స్వాతి మలివాల్ క్యారెక్టర్‌ను చంపేస్తున్నారు: బీజేపీ

85చూసినవారు
స్వాతి మలివాల్ క్యారెక్టర్‌ను చంపేస్తున్నారు: బీజేపీ
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన బిభవ్ కుమార్‌పై చర్య తీసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సంకోచిస్తోందని బీజేపీ ఆరోపించింది. అందుకు బదులుగా స్వాతి మలివాల్‌ క్యారెక్టర్‌ను చంపేస్తున్నారని పేర్కొంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మంగళవారం మీడియాతో మాట్లాడారు. మలివాల్‌తో బిభవ్ అనుచితంగా ప్రవర్తించినట్లు అంగీకరించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్