నా కుటుంబం ప్రమాదంలో ఉంది: స్వాతి మాలీవాల్‌

77చూసినవారు
నా కుటుంబం ప్రమాదంలో ఉంది: స్వాతి మాలీవాల్‌
ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్‌ చేయడాన్ని ప్రశ్నించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్‌ చేస్తోందన్నారు.