వైభవంగా కొనసాగుతున్న కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

50చూసినవారు
వైభవంగా కొనసాగుతున్న కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శ‌నివారం రామచంద్రమూర్తి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం కల్యాణ మండపంలో సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్