హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆత్రం సక్కు

587చూసినవారు
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆత్రం సక్కు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని
కేస్లాపుర్ హనుమాన్ ఆలయంలో శనివారం ఉదయం ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజి ఎమ్మెల్యే ఆత్రం సక్కు తమ నామినేషన్ పత్రాలతో వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 23 న ఆదిలాబాద్ లో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంగళవారం జరిగే హనుమాన్ జయంతి కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. వీరివెంట ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్