ఆసిఫాబాద్: వ్యాపార లావాదేవీల్లో విభేదాలే దాడికి కారణం: సీఐ రవీందర్

54చూసినవారు
ఆసిఫాబాద్: వ్యాపార లావాదేవీల్లో విభేదాలే దాడికి కారణం: సీఐ రవీందర్
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని సాయినగర్ కు చెందిన మాచర్ల అశోక్ పై కత్తితో దాడికి పాల్పడిన కాగజ్‌నగర్‌ కు చెందిన మాచర్ల సురేష్ ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పందుల వ్యాపార లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సురేశ్ కక్షపూరితంగా అశోక్ పై కత్తితో దాడి చేశాడన్నారు. అశోక్ తండ్రి చిన్న నాగయ్య ఫిర్యాదుతో సురేష్ ను అరెస్ట్ చేసి రీమాండ్కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్