కుల వివక్షను నిర్మూలించడమే కెవిపిఎస్ లక్ష్యం

55చూసినవారు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కొమరం భీమ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆవిర్భావం దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ, 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాల సాధన కోసం, అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా కేవీపీస్ ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్